కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా రొట్టెల పండుగ నిర్వహిస్తామని నెల్లూరు ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ తెలిపారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకు నెల్లూరు బారా షహీద్ దర్గాలో జరగాల్సిన రొట్టెల పండుగపై అధికారులు, పోలీసులు, ముస్లిం మత పెద్దలతో ఆర్డీవో సమావేశం నిర్వహించారు. పండగ నిర్వహణపై మత పెద్దల అభిప్రాయాలను సేకరించారు. ప్రజలెవ్వరికి ఇబ్బంది లేకుండా సాంప్రదాయం ప్రకారం రొట్టెల పండుగను నిర్వహించాలని, ఇందుకోసం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము అంగీకరిస్తామని మత పెద్దలు తెలియజేశారు.
ఇదీ చదవండి