ETV Bharat / city

'లాక్​డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు'

నెల్లూరు జిల్లాలో లాక్​ డౌన్ నిబంధనల అమలు, కరోనా వ్యాప్తి నియంత్రణపై తీసుకుంటున్న చర్యలపై జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు, ఎస్పీ భాస్కర్ భూషణ్ ఈటీవీ భారత్​తో మాట్లాడారు. అమలు చేస్తున్న చర్యలు వివరించారు.

nellore collector sp on lockdown over corona effect in district

author img

By

Published : Mar 25, 2020, 5:42 PM IST

జిల్లా ఎస్పీతో ఈటీవీ భారత్ ముఖాముఖి

కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు అన్నారు. వచ్చే నెల 14 వ తేదీ వరకు లాక్​ డౌన్ ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా సహకరించాలని కోరారు. రైతు బజార్లను ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య తెరిచి ఉంచేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు.

జిల్లా వ్యాప్తంగా 187 కేసులు:ఎస్పీ

లాక్ డౌన్ నిబంధనలనతో పాటు 144వ సెక్షన్​ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటికే 187మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 112 చెక్​పోస్టులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:

రాములో రాములా... కరచాలనం వద్దురా...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.