ETV Bharat / city

సర్వేపల్లి కాలువ పనులు వచ్చే నెలలో ప్రారంభం: మంత్రి అనిల్ - నెల్లూరు జిల్లా వార్తలు

సర్వేపల్లి కాలువ రిటైనింగ్ వాల్ పనులను వచ్చే నెల 15 నుంచి ప్రారంభిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. కాలువ పక్కన ఉన్న ఇళ్లను తొలగించాలని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు.

minister anil kumar yadav
minister anil kumar yadav
author img

By

Published : Mar 21, 2021, 3:19 PM IST

నెల్లూరులోని సర్వేపల్లి కాలువ రిటైనింగ్ వాల్ పనులను వచ్చే నెల 15 నుంచి ప్రారంభిస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. పనుల కారణంగా సర్వేపల్లి కాలువకు ఈ సీజన్ నీటి విడుదలను నిలిపివేస్తున్నామని ప్రకటించారు. నగరంలోని 16వ డివిజన్ లో మంత్రి పర్యటించారు.

స్థానికుల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇళ్లను తరలిస్తారని ఎవరైనా ప్రచారం చేసినా... నమ్మవద్దని కోరారు. నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.

ఇదీ చదవండి:

ఖాతాదారుల సొమ్ము స్వాహా చేసిన తపాలా అధికారి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.