ETV Bharat / city

సీఎం సభ ఏర్పాట్లను మంత్రి అనిల్ పరిశీలన - సీఎం సభ ఏర్పాట్లను మంత్రి అనిల్ పరిశీలన

అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే పథకం మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. నెల్లూరు జిల్లా నుంచి రైతు భరోసాకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు. సీఎం అయ్యాక వైఎస్ జగన్ తొలిసారి జిల్లాకు వస్తుండటంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

అనిల్ కుమార్
author img

By

Published : Oct 13, 2019, 6:28 AM IST

ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి అనిల్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ రైతుభరోసా పథకాన్ని నెల్లూరు సమీపంలోని కాకుటూరులో ఈ నెల 15న సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. ఆ రోజు ఉదయం 10:30 గంటలకు విక్రమసింహపురి విశ్వవిద్యాలయానికి చేరుకోనున్న సీఎం... అక్కడి నుంచి సభా ప్రాంగణానికి వెళ్లనున్నారు. కౌలు రైతులకు కార్డులు పంపిణీ చేసి, పెట్టుబడి సాయం చెక్కులను అర్హులకు అందించనున్నారు. తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సీఎం సభ ఏర్పాట్లను మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ శనివారం పరిశీలించారు. ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారిగా జగన్‌ నెల్లూరు వస్తున్నారని రైతు భరోసా కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించటం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందుతారని మంత్రి తెలిపారు.

Intro:పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందంటూ గత రెండు రోజులుగా పురపాలక సంఘం లో నిరసన వ్యక్తం చేస్తున్న శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు ను సబ్ కలెక్టర్ విశ్వనాధన్ కలిసి చర్చించారు. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీనిపై శాసనసభ్యులు నిరసన కార్యక్రమాన్ని విరమించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

Body:శాసనసభ్యులు రామానాయుడు నిరసన కార్యక్రమం విరమణ

Conclusion:శాసనసభ్యులు రామానాయుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.