జనవరిలో అమ్మ ఒడి కింద రెండో విడత నగదును జమ చేయనున్నట్లు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. నెల్లూరు నగరంలోని పలు పాఠశాలలను మంత్రి పరిశీలించారు. నాడు-నేడు మొదటి విడత కింద రాష్ట్రంలో 15వేల పాఠశాలల్లో అన్ని మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. నవంబర్ రెండో తేదీ నాటికి పాఠశాలల్లో వసతులు మెరుగుపరిచి, కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకోకుండా ప్రతిపక్షాలు విమర్శలు చేయడం అర్థరహితమన్నారు. నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఘోష హాస్పిటల్కు త్వరలో శంకుస్థాపన చేస్తామని, నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
ఇదీ చదవండి