ETV Bharat / city

పారిశుద్ధ్య సామగ్రి కొనుగోలులో అవకతవకలు..

కొవిడ్‌ నివారణ చర్యల్లో భాగంగా.. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య సామగ్రి కొనుగోలు చేసేందుకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు రాష్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. వీటి కొనుగోలుకు ముందుకొచ్చిన ఉన్నతాధికారులు అవకతవకలు పాల్పడ్డారు. ఈనాడు, ఈటీవీ భారత్​’ నిఘాతో.. చివరకు ఆఘమేఘాలపై టెండర్లు రద్దు చేయడం కీలకంగా మారింది.

Manipulations in the purchase of sanitary ware in Nellore
పారిశుద్ధ్య సామగ్రి కొనుగోలులో అవకతవకలు.. ఈనాడు, ఈటీవీ భారత్​’ నిఘాతో వెలుగులోకి..
author img

By

Published : Jan 3, 2021, 8:00 PM IST

వడ్డించే వాడు మనవాడైతే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదన్న నానుడిని అక్షరాలా నిజం చేసి చూపిస్తున్నారు జిల్లాలోని కొందరు. అయినవాళ్లకు లబ్ధి చేకూర్చే క్రమంలో అడ్డంగా నిబంధనలకు తిలోదకాలిస్తుండటం ఓ ఎత్తయితే... అడ్డదారిలో రెట్టింపు ధరలతో అందినంత దండుకునేందుకు యత్నిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. నాసిరకం మాటున చక్కబెట్టేందుకు ఏకఛత్రాధిపత్యంగా పావులు కదుపుతుండటం క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. రాజకీయ రంగు పులుముకోవడంతో ఆడిందే ఆటగానూ మారింది. జిల్లాలో ఫాగింగ్‌ యంత్రాలు, స్ప్రేయర్ల కొనుగోళ్లలో ఈ మాయాజాలం నెలకొనగా.. ‘ఈనాడు, ఈటీవీ భారత్​’ నిఘాతో చివరకు ఆఘమేఘాలపై టెండర్లు రద్దు చేయడం కీలకమైంది.

కొవిడ్‌-19 నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తుండటం తెలిసిందే. ఆ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పారిశుద్ధ్య సామగ్రి కొనుగోలు చేసేందుకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు అనుమతిచ్చారు. ఆ మేరకు జిల్లాలో 81 ఫాగింగ్‌ యంత్రాలు, 500 స్ప్రేయర్లతో పాటు కార్మికులకు అవసరమైన కిట్ల కొనుగోలుకు ఉన్నతాధికారులు ముందుకొచ్చారు. ఆ మేరకు గత ఏడాది డిసెంబరులో కసరత్తు మొదలైంది.

ఇవేం ధరలు...

జిల్లాలో 81 ఫాగింగ్‌ యంత్రాలు, 500 స్ప్రేయర్ల పంపిణీకి డీసీఎంఎస్‌ వర్క్‌ ఆర్డర్‌ దక్కించుకుంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. అందులో పేర్కొన్న ధరలు చూస్తేనే దిమ్మ తిరుగుతోంది. ఒక్కో ఫాగింగ్‌ యంత్రానికి రూ.69వేలు, స్ప్రేయర్‌కు రూ. 5వేల చొప్పున ఖరీదు నమోదు చేశారు. ఈలెక్కన మొత్తం రూ.80.89 లక్షలకు ‘టెండర్‌’ పెట్టడం గమనార్హం. ఇందులో స్ప్రేయర్లు రూ.25లక్షలు, ఫాగింగ్‌ యంత్రాలు రూ.55.89 లక్షలతో కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కిసాన్‌గో ఐఎస్‌ఐ ధ్రువీకృత బ్రాండ్‌వి తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. వాస్తవానికి వీటి ధరలు ఆన్‌లైన్‌లో పరిశీలించగా.. సగమే ఉండటం గమనార్హం. ఇతర సంస్థల రకాలు చూసినా ఫాగింగ్‌ యంత్రాలు రూ.20వేల నుంచి రూ.40వేల మధ్య ఉంటుండగా- స్ప్రేయర్లు రూ.మూడు వేల వరకు కనిపిస్తున్నాయి. మరి, ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించడం ద్వారా ఎవరికి లబ్ధి చేకూర్చాలనుకుంటున్నది అంతు చిక్కని ప్రశ్న.

అక్కడే స్పష్టం..

ఈ టెండర్‌కు సంబంధించి కొన్ని షరతులను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మార్గదర్శకాల ప్రకారం.. ఒక ఫాగింగ్‌ యంత్రం, ఒక హ్యాండ్‌ స్ప్రేయర్‌ను ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రిన్సిపల్‌కు సమర్పించి.. వారు ధ్రువీకరించిన మోడళ్లను జిల్లా పంచాయతీ అధికారికి సమర్పించిన తర్వాతే సరఫరా చేయాలని స్పష్టం చేశారు. సరఫరాలో పగిలినా, దెబ్బతిన్నా.. సరఫరాదారే బాధ్యత వహించాల్సి ఉంటుందని, వారంటీ కాలంలో పరికరాల్లో వచ్చే మరమ్మతులు సొంత ఖర్చుతో చేయాలని సూచించారు. దీనికి సంబంధించి ఐటీఐలో నాణ్యత పరిశీలన చేసినట్లు తెలుస్తుండగా.. అక్కడా మాయాజాలం ప్రదర్శించడం వారికే చెల్లింది. అవే స్పెసిఫికేషన్స్‌తో కూడిన వేరే బ్రాండ్లను పరిశీలన కోసం పంపారన్నది సమాచారం. తద్వారా అక్రమానికి ‘ఆమోదముద్ర’ వేయించుకునే ప్రయత్నం చేయడం విమర్శనాత్మకంగా మారింది. దీనికి సంబంధించిన ఆధారాలను ‘ఈనాడు, ఈటీవీ భారత్​’ సేకరించింది.

గుట్టుగా తంతు..

ఈ వ్యవహారంలో రాజకీయ జోక్యం హెచ్చుమీరడంతో గుట్టుగా తంతు సాగింది. ఎక్కడికక్కడ అధికారులపైనా ఒత్తిడి రావడంతో ప్రేక్షక పాత్రకే పరిమితమైనట్లు తెలుస్తోంది. తక్కువ ధర, నాణ్యత కోసమే డీసీఎంఎస్‌ను ఆశ్రయించే పరిస్థితి ఉండగా.. ఇక్కడ అందుకు భిన్నంగా తంతు సాగడంపై విమర్శలకు తావిస్తోంది. ఇక్కడ ఒప్పందం కాకుండానే వర్క్‌ ఆర్డర్‌ ఎలా ఇచ్చారన్నది మరో శేష ప్రశ్న. డెమోకు పిలవాల్సి ఉండగా- పొరపాటున వర్క్‌ ఆర్డర్‌ రాసినట్లు అధికారులు చెబుతున్నా.. సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

రీటెండరుకు చర్యలు..

ఈ విషయమై శనివారం సాయంత్రం జేసీ ప్రభాకర్‌రెడ్డితో ‘ఈనాడు’ మాట్లాడగా... టెండరులో ఎల్‌1గా వచ్చిన వారికి అవకాశం కల్పించామని చెప్పారు. ధరల విషయమై పునః పరిశీలన చేస్తామన్న ఆయన.. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతలోనే టెండర్లు రద్దు చేస్తున్నట్లు రాత్రి స్పష్టం చేశారు. కొన్ని పొరపాట్లు దొర్లాయని, పక్కాగా రీటెండర్‌ జరిపేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఇదీ చదవండి:

రామతీర్థం ఘటనపై వారికి నార్కో పరీక్షలు చేయాలి: మంత్రి కొడాలి నాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.