ETV Bharat / city

అక్రమ మద్యం, నాటుసారా స్థావరాలపై ఎస్​ఈబీ దాడులు - నెల్లూరు జిల్లా అక్రమ రవాణా తాజా వార్తలు

కృష్ణా, కడప, నెల్లూరు జిల్లాల్లో మద్యం అక్రమ రవాణా, నాటుసారా స్థావరాలపై ఎస్​ఈబీ అధికారులు దాడులు చేశారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారిని అరెస్ట్​ చేసి కేసు నమోదు చేశారు. వీరి వద్ద నుంచి మద్యం బాటిళ్లు, నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.

liquor transporting caught by seb officers in krishna, kadapa and nellore districts
నెల్లూరు జిల్లాలో అక్రమ మద్యం రవాణా పట్టివేత
author img

By

Published : Aug 21, 2020, 3:36 PM IST

కృష్ణా, కడప, నెల్లూరు జిల్లాల్లో మద్యం అక్రమ రవాణా, నాటుసారా విక్రయాలు చేస్తున్న వారిని ఎస్​ఈబీ అధికారులు అరెస్ట్​ చేశారు. అనంతరం వీరిపై కేసులు నమోదు చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధిస్తామని పోలీసులు హెచ్చరించారు.

కృష్ణా జిల్లాలో..
నందిగామ మండలం పల్లగిరి వద్ద వాహన తనిఖీల్లో 49 కేసుల(2352 మద్యం సీసాలు) తెలంగాణ మద్యాన్ని టాస్క్​ఫోర్స్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు తెలంగాణలోని మడుపల్లి నుంచి గుంటూరు జిల్లాకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

liquor transporting caught by seb officers in krishna, kadapa and nellore districts
కృష్ణా జిల్లాలో అక్రమ మద్యం పట్టివేత

కడప జిల్లాలో..
రైల్వేకోడూరు మండలంలోని నాటుసారా స్థావరాలపై ఎస్​ఈబీ అధికారులు దాడులు చేశారు. జిల్లా అదనపు ఎస్పీ శ్రీచక్రవర్తి ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించారు. మైసూర్​వారిపల్లికి చెందిన వరికూరి కృష్ణయ్య వద్ద నుంచి 10 లీటర్లు... బాలిశెట్టి వెంకటయ్య నుంచి 8 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై రామ్మోహన్​ తెలిపారు.

కడప జిల్లాలో నాటుసారా స్థావరాలపై దాడులు

నెల్లూరు జిల్లాలో..
జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా మద్యం అమ్మకాలు చేస్తున్న కానిస్టేబుల్​, హోంగార్డులను ఎస్​ఈబీ అధికారులు పట్టుకున్నారు. కిసాన్​ నగర్​ చెక్​పోస్ట్​ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో మద్యం తరలిస్తున్న హోంగార్డ్​ శ్రీకాంత్​ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారించగా... ఆత్మకూరులో కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్న ఖాదర్​ భాష ఇంటిపై అధికారులు దాడులు చేశారు. వీరి వద్ద నుంచి రూ. 3 లక్షల విలువ గల 733 మద్యం సీసాలు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి అక్రమ మార్గంలో మద్యం తీసుకువచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఎస్​ఈబీ ఏఎస్పీ శ్రీధర్​రావు తెలిపారు.

నెల్లూరు జిల్లాలో అక్రమ మద్యం పట్టివేత

ఇదీ చదవండి :

మద్యం అక్రమ రవాణాపై ఎస్​ఈబీ అధికారుల దాడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.