'కాపు కార్పొరేషన్‌కి చంద్రబాబు ఎంతో సేవ చేశారు' - Former Kapu Corporation Chairman Ramanjaneyu latest press meet news
తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపు కార్పొరేషన్‌కి ఆయన ఎంతో కృషి చేశారని కాపు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ రామాంజనేయులు అన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి వచ్చిన తర్వాత ఉన్న పథకాలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. గత తొమ్మిది నెలలుగా తొమ్మిది పైసలు కాపు కార్పొరేషన్ ద్వారా ఎవరూ లబ్దిపొందిన దాఖలాలు ఎక్కడా లేవన్నారు. 'అఖిల భారత కాపు కార్పొరేషన్' నాయకులతో కర్నూలు, కడప జిల్లాల్లో పర్యటన ముగించుకున్న ఆయన నెల్లూరులో తెదేపా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
కాపు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ప్రెస్ మీట్