ETV Bharat / city

WOMENS DAY SPECIAL: అమ్మలు పిల్లలయ్యారు... మైమరిచి ఆటలాడారు - నెల్లూరులో మహిళల సంబరాలు

WOMENS DAY SPECIAL: చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు... స్నేహితులతో కలిసి పాడుకున్న పాటల కన్నా.. బాల్య స్మృతులు మన జీవితంలో ఏముంటాయి? అందుకే చిన్నప్పటి సరదాలను గుర్తు చేసుకున్నారు ఆ మహిళలు.! కలిసిమెలసి ఆడుకునే ఆటల్లో మజాను.. నేటితరం పిల్లలూ ఆస్వాదించాలంటూ అమ్మలే.. పిల్లలుగా మారారు.

WOMENS DAY SPECIAL CELEBRATIONS IN NELLORE
నెల్లూరులో మహిళా దినోత్సవ సంబరాలు
author img

By

Published : Mar 8, 2022, 1:51 PM IST

నెల్లూరులో మహిళా దినోత్సవ సంబరాలు

WOMENS DAY SPECIAL: నెల్లూరు ఆర్యవైశ్య మహిళా విభాగం మహిళా దినోత్సవాలు వినూత్నంగా సాగాయి. సభ్యులంతా ఒకచోట చేరి బాల్యంలో తాము ఆడిన ఆటలు ఆడుకున్నారు. వామనగుంట, పాము పటం ఆట, తొక్కడు బిళ్ల, అచ్చనకాయ, రింగ్ బాల్, చెమ్మచెక్క, కళ్ల గంతలు ఇలా 12 రకాల ఆటలు ఆడారు.

"ఇప్పటి తరం పిల్లలు మమ్మీ.. ట్యాబ్​ ఉందా..? మొబైల్​ ఉందా..? అని అడుగుతున్నారు. మా కాలంలో అచ్చనకాయ, బారాకట్టా, తొక్కుడు బిల్ల, స్కిప్పింగ్​, రింగ్​బాల్​.. ఇలా ఎన్నెన్నో ఆడేవాళ్లం. కానీ ప్రస్తుత తరం పిల్లలు మాత్రం ఏదీ ఆడటం లేదు. దీనివల్ల ఊబకాయంతో పాటు అనేక రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. పాతకాలం ఆటల వల్ల ఎక్కువ శ్రమ కలిగి ఆరోగ్యంగా ఉంటారు."- మహిళలు

WOMENS DAY SPECIAL: చిన్ననాటి ఆటలేకాదు బాల్యంలో తాము బాగా ఆస్వాదించిన అపురూప గీతాలకు నృత్యాలు చేశారు. చిన్నతనంలో తాము ఆ పాటలకు డాన్సులు వేయలేకపోయామని... ఇప్పుడు ఆ సరదా తీరిందంటూ సంబరపడ్డారు.

మన ఆచార వ్యవహారాలతో పాటు చిన్ననాటి ఆటపాటలనూ భావితరాలకు అందించాలనే ఉద్దేశంతోనే కార్యక్రమం ఇలా జరుపుకున్నామని నిర్వాహకులు తెలిపారు.

"ఇంటిపని, వంట పని చేసుకోవడం వల్ల చాలా అలసిపోతున్నాం. వీటన్నింటికీ కొంచెం బ్రేక్​ ఇచ్చి ఆటలు ఆడుకుంటున్నాం. మాతోపాటు పిల్లలకు ఇలాంటి గేమ్స్​ నేర్పించడం వల్ల చాలా సంతోషంగా ఉంది. పిల్లలు సెల్​ఫోన్లకు అలవాటుపడిపోయారు. దీనిని వినియోగించడానికి శారిరక శ్రమ అవసరం లేదు. కానీ గేమ్స్​ ఆడటం వల్ల గెలుపోటములను సమానంగా తీసుకుంటారు."-మహిళలు

కలిసిమెలిసి ఆడే ఆటలు కనుమరుగయ్యాయని, మళ్లీ గత వైభవం రావాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: Loco Pilots: అవకాశాలను అందిపుచ్చుకుని.. లోకో పైలెట్లుగా దూసుకెళ్తూ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.