నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద జాతీయ రహదారిపై ఎస్ఈబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మినీ వ్యానులో అక్రమంగా తరలిస్తున్న రూ.2.50 లక్షల విలువైన 1650 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి ప్రకాశం జిల్లా చీరాలకు మద్యాన్ని తరలిస్తున్న డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్పోస్ట్ వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారుగా లక్ష రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. లారీని సీజ్ చేసినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: ఆత్మకూరులో 290 కర్ణాటక మద్యం బాటిళ్ల పట్టివేత