నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కచేరీ దేవరాయ పల్లి గ్రామంలో పెన్నా పరివాహక ప్రాంతం నుంచి పట్టపగలే జేసీబీ లతో ఇసుకను తవ్వి ట్రాక్టర్లతో అక్రమంగా తరలించేస్తున్నారు. అక్కడక్కడ గుట్టలుగా పోసి అర్ధరాత్రి దాటిన తర్వాత టిప్పర్లతో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పెన్నా నదికి గ్రామానికి మధ్యన కరకట్టను సైతం ధ్వంసం చేసి ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. స్పందన లేదని వాపోతున్నారు.
కరకట్టల ధ్వంసంతో గ్రామాల్లోకి వరద నీరు..
గతంలో పెన్నా నదికి వరదలు వచ్చినప్పుడు కరకట్ట ధ్వంసమై గ్రామంలోకి వరద నీరు వచ్చిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విధంగా ఇప్పుడు కూడా ఇసుక అక్రమ రవాణాతో గ్రామానికి ముప్పు పొంచి ఉందని తెలిపారు. గతంలో జాయింట్ కలెక్టర్ పెన్నా నది పొర్లు కట్టలు ఎవరు ధ్వంసం చేసినవారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. పెన్నా పరివాహక ప్రాంతంలోని సోమశిల నుంచి సంగం వరకు ఇదే పరిస్థితి నెలకొందని అక్కడి ప్రజలు అంటున్నారు. చర్యలు తీసుకుని గ్రామాలను వరద ముంపు నుంచి కాపాడాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి:
వచ్చే వారం మార్కెట్లోకి స్పుత్నిక్-వి టీకా!
శవాన్ని భద్రపరిచేందుకు ఫ్రీజర్ల కొరత.. 4 రోజుల్లోనే బాడీ డీకంపోజ్!