ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా సోమశిల జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఆనకట్ట ఇన్ ఫ్లో లక్షా 13 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో లక్షా 13 వేల క్యూసెక్కులుగా ఉంది. జలాశయం 9 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 74 టీఎంసీలుగా ఉంది. జలాశయం పూర్తి సామర్థ్యం 77.988 టీఎంసీలు. నీటి విడుదల నేపథ్యంలో.. పెన్నా పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: శ్రీశైలం జలాశయానికి భారీ వరద... పది గేట్లు ఎత్తివేత