ETV Bharat / city

నెల్లూరు జిల్లాలో హై ఎండ్ అల్యూమినియం అల్లాయ్‌ పరిశ్రమ

NALCO and MITHANI : నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారిపాలెంలో హై ఎండ్ అల్యూమినియం అల్లాయ్‌ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ముందడుగు పడింది. ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి జగన్ ను నాల్కో సీఎండీ శ్రీధర్‌ పాత్ర, మిధాని సీఎండీ సంజయ్‌కుమార్‌ ఝా కలిసి వివరించారు.

Utkarsha Aluminum Ore Corporation Limited

author img

By

Published : Apr 26, 2022, 8:59 AM IST

NALCO and MITHANI : నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారిపాలెంలో హై ఎండ్ అల్యూమినియం అల్లాయ్‌ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ముందడుగు పడింది. ఈ మేరకు నాల్కో, మిథాని సంయుక్త సంస్థ.... ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగమ్‌ లిమిటెడ్ అంగీకారం తెలిపింది. ఏడాదికి 60 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో 5 వేల 500 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రెండు నుంచి రెండున్నర ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ మేరకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన నాల్కో సీఎండీ శ్రీధర్‌ పాత్ర, మిథాని సీఎండీ సంజయ్‌కుమార్‌ ఝా వివరాలు తెలిపారు. దాదాపు 750 నుంచి వెయ్యి మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనకు ఎదురవుతున్న సమస్యలను సీఎం దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. వెంటనే పరిష్కరించాలని సంబంధింత శాఖల అధికారులను సీఎం ఆదేశించారు. రక్షణ అనుబంధ రంగాలకు సంబంధించిన పరికరాల తయారీదారుల అవసరాలు తీర్చడానికి.. ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా ఎంస్ఎంఈ పార్కును కూడా ఏర్పాటు చేయాలని సీఎం సూచించగా, దీనికి సీఎండీలు అంగీకరించారు.

ఇదీ చదవండి : కోర్టుల నుంచి ఆధారాలు చోరీ అయితే విచారణ ఎలా?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.