అయోధ్యలో రామ మందిరం నిర్మాణంలో కులమతాలకు అతీతంగా ప్రజలందరినీ భాగస్వామ్యులను చేయడంతో ప్రతి ఒక్కరూ తమ వంతుగా విరాళం ఇస్తున్నారని మాజీమంత్రి, భాజపా నాయకులు కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షులు పెసల జయరాజగోపాల్ కుటుంబ సభ్యులు 2.50లక్షల విరాళం అందించారు. రామ మందిరం నిర్మాణానికి ఇవ్వడం సంతోషంగా ఉందని దాత పేర్కొన్నారు.
ఇవీ చదవండి: టీఎన్ఎస్ఎఫ్ రాస్తారోకోను అడ్డుకున్న పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం