disabled man walking 750 kms: నెల్లూరు జిల్లాకు చెందిన అకరపక్క సురేశ్ అనే దివ్యాంగుడు అనేక వ్యయప్రయాసలను అధిగమించి.. కాలినడకన శబరిమల యాత్రను విజయవంతంగా పూర్తి చేశాడు. కేవలం ఒక్క కాలుతో.. నెల్లూరు నుంచి 750 కిలోమీటర్లకు పైగా నడిచి శబరిగిరీశుడు అయ్యప్ప సన్నిధికి చేరుకున్నాడు. ఓ ఊతకర్రను సాయంగా చేసుకుని.. పవిత్రమైన అయ్యప్ప ఇరుముడిని తలపై పెట్టుకుని మహాపాదయాత్రను సురేశ్ పూర్తి చేశాడు.
అఖిల భారత అయ్యప్ప స్వామి దీక్ష ప్రచార సభ సభ్యుడైన సురేశ్.. ఈ యాత్రను అకుంఠిత దీక్షతో 105 రోజుల్లో పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఆయన తన స్వగ్రామం నుంచి వివిధ రాష్ట్రాలను దాటుకుంటూ.. 750 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఇందుకోసం ఆయన సెప్టెంబరు మాసం 20వ తేదీన తన నడకను ప్రారంభించాడు. నగరంలోని ఓ బంగారు వ్యాపార సంస్థలో స్వర్ణకారుడిగా పని చేస్తున్న సురేశ్.. శబరిమలను దర్శించుకోవడం ఇది రెండోసారని తెలుస్తోంది.
స్వామి అయ్యప్ప దర్శనానికి వెళ్లిన సురేశ్‌కు అక్కడి దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామికి అవసరమైన సహాయాన్ని అందిస్తూ.. వేగంగా దర్శనాన్ని పూర్తి చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించారు.
ఇదీ చదవండి:
నెల్లూరు : కంటేపల్లి వద్ద కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం..!