నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద తెదేపా, వైకాపా నాయకులు ఘర్షణకు దిగారు. రమేశ్ రెడ్డి నగర్లోని నామినేషన్ కేంద్రం, 43వ డివిజన్లోని మరో కేంద్రం వద్ద తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఈ ఘర్షణలో కొందరికి గాయాలయ్యాయి. తెదేపా నాయకుడు కాకర్ల వెంకటరావుకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. తెదేపా అభ్యర్ధిగా నామినేషన్ వేసిన తిరుమలనాయుడుపైనా దాడి చేశారు. రిటర్నింగ్ అధికారి రవీంద్ర ముందే ఘర్షణకు దిగడం గమనార్హం. గొడవ కారణంగా నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి.