Atmakuru by election nominations: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయ్యిందని.. ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరేంద్ర ప్రసాద్ తెలిపారు. 28 అభ్యర్థులకు గాను 38 సెట్ల నామినేషన్ దాఖలు చేశారన్నారు. వివిధ కారణాల వల్ల 13 మందిని తిరస్కరించామని వివరించారు. ప్రస్తుతం 15 మంది ఎన్నికల బరిలో ఉన్నారన్నారు. ఈనెల 9 వరకు ఉపసంహరణకు తుది గడువు ఉందన్నారు. ఆ తరువాత ఉన్నవారు పోటీకి అర్హులని తెలిపారు. ఈ ఉప ఎన్నికకు ఈ నెల 23వ తేదీన పోలింగ్ జరగనుందని పేర్కొన్నారు. కావున ప్రజలందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.
అయితే నామినేషన్ దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు సంతకాల ఫోర్జరీ చేసినట్లు గుర్తించామన్నారు. వారిపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇవీ చదవండి :