CBI: హైదరాబాద్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మోసగించిన నలుగురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. రూ.61.71 కోట్లు మోసం చేసినట్లు బ్యాంకు ఫిర్యాదు చేయడంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు నెల్లూరులోని రెండు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 2017-18లో బ్యాంకు నుంచి నెల్లూరుకు చెందిన రాజరాజేశ్వరి రైస్ మిల్లు యాజమాన్యం రుణం తీసుకుని... చెల్లించకుండా మోసగించినట్లు సీబీఐ అధికారులకు ఫిర్యాదు అందడంతో... ప్రసన్న, ప్రతిమ, పద్మనాభరెడ్డి సహా పలువురిపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.
ఇదీ చదవండి: ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనేది మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్
CBI: బ్యాంకుని మోసం చేసిన కేసులో... నలుగురిపై సీబీఐ కేసు నమోదు
CBI: బ్యాంకుని మోసం చేసిన కేసులో నెల్లూరుకు చెందిన రైస్ మిల్లుపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. రూ.61.71 కోట్లు మోసం చేసినట్లు బ్యాంకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.
CBI: హైదరాబాద్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మోసగించిన నలుగురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. రూ.61.71 కోట్లు మోసం చేసినట్లు బ్యాంకు ఫిర్యాదు చేయడంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు నెల్లూరులోని రెండు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 2017-18లో బ్యాంకు నుంచి నెల్లూరుకు చెందిన రాజరాజేశ్వరి రైస్ మిల్లు యాజమాన్యం రుణం తీసుకుని... చెల్లించకుండా మోసగించినట్లు సీబీఐ అధికారులకు ఫిర్యాదు అందడంతో... ప్రసన్న, ప్రతిమ, పద్మనాభరెడ్డి సహా పలువురిపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.
ఇదీ చదవండి: ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనేది మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్
TAGGED:
nellore latest updates