ETV Bharat / city

కృష్ణపట్నం పోర్టులో అదానీ గ్రూప్‌ 100% పెట్టుబడులు

adani-group
adani-group
author img

By

Published : Apr 5, 2021, 1:39 PM IST

Updated : Apr 6, 2021, 7:51 AM IST

13:37 April 05

నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు పూర్తిగా అదానీ గ్రూపు చేతికి వచ్చింది. ఈ పోర్టులో ఇప్పటికే 75% వాటా ఉండగా, విశ్వ సముద్ర హోల్డింగ్స్‌ అనే సంస్థ నుంచి రూ.2,800 కోట్లకు 25% వాటాను కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నట్లు అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ సోమవారం వెల్లడించింది. కృష్ణపట్నం పోర్టును హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న నవయుగ గ్రూపు నిర్మించింది. నవయుగ నుంచి గత ఏడాది అక్టోబరులో 75% వాటాను అదానీ గ్రూపు కొనుగోలు చేసింది. ఇటీవల విశాఖ సమీపంలోని గంగవరం పోర్టును సైతం అదానీ గ్రూపు పూర్తిగా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు పూర్తిగా అదానీ గ్రూపు చేతికి వచ్చింది. ఈ పోర్టులో ఇప్పటికే అదానీ గ్రూపు సంస్థ అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ లిమిటెడ్‌కు 75% వాటా ఉండగా, మిగిలిన 25% వాటా కూడా సొంతం చేసుకుంటోంది. విశ్వ సముద్ర హోల్డింగ్స్‌ అనే సంస్థ నుంచి 25% వాటాను రూ.2,800 కోట్లకు కొనుగోలు చేయడానికి ఈ నెల 1న ఒప్పందం కుదుర్చుకున్నట్లు అదానీ పోర్ట్స్‌ సోమవారం వెల్లడించింది. దీంతో ఈ పోర్టులో నూరు శాతం వాటాను అదానీ పోర్ట్స్‌ దక్కించుకున్నట్లు అవుతోంది.

నవయుగ గ్రూప్‌ నిర్మాణం

కృష్ణపట్నం పోర్టును హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న నవయుగ గ్రూపు నిర్మించింది. ఈ సంస్థ నుంచి గత ఏడాది అక్టోబరులో 75% వాటాను అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ కొనుగోలు చేసింది. అప్పట్లో దీనికి రూ.13,675 కోట్ల సంస్థాగత విలువ కట్టారు. చెన్నైకు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణపట్నం పోర్టు అతి తక్కువ సమయంలోనే తూర్పు తీరంలో అత్యంత ముఖ్యమైనదిగా ఎదిగింది. ఈ పోర్టు నుంచి ఇనుప ఖనిజం, బొగ్గు, వంట నూనెలు.. మరిన్ని రకాల సరకులు భారీగా రవాణా అవుతున్నాయి. పోర్టు వార్షిక సరకు రవాణా సామర్థ్యం 64 మిలియన్‌ టన్నులు కాగా, దీన్ని 300 మి.టన్నుల వరకు విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధంగా ఉంది. కృష్ణపట్నం పోర్టు 2019-20లో రూ.1,975 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. 2020-21లో రూ.1,840 కోట్ల ఆదాయాన్ని, రూ,1,325 కోట్ల స్థూల లాభాన్ని ఈ సంస్థ ఆర్జించే అవకాశం ఉంది.

500 మి.టన్నుల సామర్థ్యమే లక్ష్యం: కరన్‌

కృష్ణపట్నం పోర్టులో నూరుశాతం వాటా సొంతం చేసుకోవడం ద్వారా 2025 నాటికి తమ అజమాయిషీలో 500 మిలియన్‌ టన్నుల సరకు రవాణా సామర్థ్యం గల పోర్టులు ఉండాలనే లక్ష్యానికి దగ్గరైనట్లు అవుతోందని అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ లిమిటెడ్‌ సీఈఓ కరన్‌ అదానీ అన్నారు. ప్రస్తుత స్థాయి నుంచి 2025 నాటికి కృష్ణపట్నం పోర్టు రెట్టింపు సరకు రవాణా చేస్తుందని వివరించారు. అప్పటికి లాభాలు మూడు రెట్లు పెరుగుతాయన్నారు. దక్షిణ ఆంధ్రప్రదేశ్‌, కర్నాటకలకు ఎంతో ముఖ్యమైనదిగా కృష్టపట్నం పోర్టు మారుతుందని విశ్లేషించారు.

గంగవరం కూడా..

అదానీ గ్రూపు ఇటీవల విశాఖపట్నం సమీపంలోని గంగవరం పోర్టును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ పోర్టు ప్రమోటర్‌ అయిన డీవీఎస్‌ రాజు, అందులో పెట్టుబడులు పెట్టిన వార్‌బర్గ్‌ పింకస్‌ అనే విదేశీ సంస్థ నుంచి వాటాలు కొనుగోలు చేసి గంగవరం పోర్టును పూర్తిగా తన అజమాయిషీలోకి అదానీ గ్రూపు తెచ్చుకుంది. ఇదేవిధంగా కృష్ణపట్నం పోర్టులో సైతం నూరుశాతం వాటా కొనుగోలు చేసింది. తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు రంగంలో ఉన్న రెండు ముఖ్యమైన పోర్టులు అదానీ గ్రూపు చేతికి వెళ్లినట్లు అవుతుంది. ఈ రెండింటితో పాటు అదానీ గ్రూపు చేతిలో గుజరాత్‌లోని ముంద్ర, దహేజ్‌, టున, హజీరా పోర్టులు, ఒడిశాలోని ధమ్రా, గోవాలోని మార్మగోవా, మహారాష్ట్రలోని దిఘి, తమిళనాడులోని కట్టుపల్లి, ఎన్నూర్‌ పోర్టులు ఉన్నాయి. కేరళలో విజింజమ్‌ పోర్టును సంస్థ అభివృద్ధి చేస్తోంది.

ఇదీ చదవండి: బీజాపుర్​ భీకర దాడి వెనుక ప్రణాళిక హిడ్మాదే!

Last Updated : Apr 6, 2021, 7:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.