నెల్లూరు పెన్నానదిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. స్నేహితుడితో కలిసి పెన్నా కొత్త బ్రిడ్జి వద్దకు వచ్చిన యువకుడు సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు నదిలో జారిపడిపోయాడు. గల్లంతైన యువకుడు నగరంలోని యలమవారిదిన్నెకు చెందిన విక్రాంత్గా పోలీసులు గుర్తించారు.
స్నేహితుడితో కలిసి పెన్నా వరద ప్రవాహాన్ని తిలకించేందుకు వచ్చి ప్రమాదవశాత్తూ నదిలో పడ్డాడు. ప్రవాహం అధికంగా ఉండటంతో నదిలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.