ETV Bharat / city

అమానవీయం.. 108 వాహనం రాక... బైక్​ పైనే.. - ద్విచక్ర వాహనంపైనే బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లిన తండ్రి

Dead body on two wheeler: తిరుపతి రుయా ఆస్పత్రి అంబులెన్స్​ సిబ్బంది ఘటన మరువక ముందే మరోచోట అదే పరిస్థితి ఏర్పడింది. ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతిచెందిన బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లి... తిరిగి ఇంటికి తీసుకెళ్లడానికి 108 వాహనాన్ని అడిగితే... నిబంధనలు అంగీకరించవంటూ నిరాకరించారు. ఎవరూ సాయం చేయకపోవడంతో చేసేదేమీ లేక బాలుడి మృతదేహాన్ని తండ్రి ద్విచక్రవాహనంపైనే ఇంటికి తీసుకెళ్లిన దయనీయమైన ఘటన అందరినీ కలచివేసింది.

dead body on two wheeler
బైకుపైనే మృతదేహం ఇంటికి
author img

By

Published : May 5, 2022, 8:04 AM IST

Updated : May 5, 2022, 12:23 PM IST

Dead body on two wheeler: రోజురోజుకు మానవత్వం మసకబారిపోతోంది. తమ వారిని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్నవారికి చేతనైన సాయాల్సిందిపోయి.. అక్కడ కూడా డబ్బులు, రూల్స్​ అంటూ వైద్య సిబ్బంది ప్రవర్తించడం దారుణం. ఈ మధ్యే తిరుపతి రుయా ఆస్పత్రిలో మృతదేహాన్ని తరలించేందుకు బయటి వాహనాన్ని అనుమతించని అంబులెన్స్​ మాఫియాను చూశాం. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పుడు అలాంటి ఘటనే నెల్లూరు జిల్లాలో జరిగింది.

సంగంలో బుధవారం శ్రీరామ్‌ (8), ఈశ్వర్‌ (10) అనే ఇద్దరు అబ్బాయిలు బహిర్భూమికి వెళ్లి.. కనిగిరి జలాశయం ప్రధాన కాలువలో ప్రమాదవశాత్తూ మునిగి మృతి చెందారు. ఈశ్వర్‌ మృతదేహాన్ని కాలువ వద్ద నుంచి ఇంటికి తీసుకెళ్లగా, శ్రీరామ్‌ను నీటిలో నుంచి బయటకు తీయగానే స్థానికులు, బంధువులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

కొంతసేపటికి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాలని 108 వాహన సిబ్బందిని కోరగా.. నిబంధనలు అంగీకరించవంటూ వారు నిరాకరించారు. మహాప్రస్థానం వాహనం అందుబాటులో లేదు. ఆటోలు, ఇతర వాహనాల వారిని బతిమాలినా ఎవరూ ముందుకు రాలేదు. గత్యంతరం లేక బాలుడి తండ్రి ద్విచక్ర వాహనంపైనే శ్రీరామ్‌ మృతదేహాన్ని ఇంటికి తరలించారు.

బైకుపైనే మృతదేహం ఇంటికి

"బాలుడి మృతదేహం తరలించడానికి ఆటోవాళ్లను ప్రాధేయపడ్డారు. కానీ వాళ్లు ముందుకు రాలేదు. ఇది సరైన పద్ధతి కాదు. ఆటోవాళ్లు కూడా ప్రజా సేవకులే. ఇలాంటి సమయాల్లో సహాయం చేయాలి. ఇకమీదట ఎవరైనా వచ్చేందుకు నిరాకరించినట్లు.. మా దృష్టికి తీసుకొస్తే కేసు నమోదు చేస్తాం. దీనిపై అవగాహన కల్పిస్తాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం" -కోటేశ్వరరావు, బుచ్చిరెడ్డిపాలెం సీఐ

ఇదీ చదవండి: Rains in AP: అకాల వర్షంతో తీవ్ర నష్టం.. నేడు, రేపు వానలు కురిసే అవకాశం

Last Updated : May 5, 2022, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.