కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం (Nandyal Regional Agricultural Research Station) భూముల్లో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు (establish a government medical college) నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తెదేపా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి డిమాండ్ చేశారు. నంద్యాల శివారులో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని సూచించారు. లేదంటే ఇతర ప్రాంతాల్లో మాదిరి భూమిని కొనుగోలు చేయాలన్నారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పేయికి వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని పరిశీలించాలని భూమా విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి : BUS ACCIDENT: డివైడర్ను ఢీకొని బస్సు బోల్తా.. డ్రైవర్ మృతి, ఏడుగురికి గాయాలు