తమ సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లాలోని వీఆర్వోలు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. నగరంలోని శ్రీకృష్ణదేవరాయల కూడలి వద్ద తమ నిరసన తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే ఎన్నో హామీలను నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్.. వీఆర్వోల సమస్యలను పరిష్కరించలేదని వాపోయారు. పదోన్నతులు, కారుణ్యనియామకాల విషయంలో తమకు అన్యాయం జరుగుతోందన్నారు. అలాగే సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న తమకు బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు.
ఇదీ చదవండి :