మంత్రుల బస్సు యాత్ర.. ప్రసంగం విన్న ఖాళీ కుర్చీలు! - మంత్రుల బస్సు యాత్ర వార్తలు
కర్నూలులో మంత్రులు చేపట్టిన బస్సు యాత్రకు ప్రజా స్పందన కరవైంది. డ్వాక్రా మహిళలను ఉదయమే వేదిక వద్దకు తరలించినా.. సభా ప్రాంగణంలో ఎలాంటి సదుపాయాలూ లేకపోవటంతో అక్కడి నుంచి ఒక్కొక్కరుగా వెళ్లిపోయారు.
empty chairs
కర్నూలులో మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర సభకు స్పందన కరువైంది. సి.క్యాంపు కూడలిలో ఏర్పాటు చేసిన సభకు.. డ్వాక్రా మహిళలను ఉదయం 10 గంటలకు వేదిక వద్దకు తరలించారు. ఎండ తీవ్రంగా ఉండటంతోపాటు సభా ప్రాంగణంలో షామియానాలు లేకపోవటంతో.. వేడికి తాళలేక మహిళలంతా ఒక్కొక్కరుగా వెళ్లిపోయారు. సభ నుంచి వెళ్లకుండా మహిళలను అధికారులు నిలువరించినా.. "ఎండ ఎక్కువగా ఉంది.. మీరే ఉండండి" అంటూ.. వెళ్లిపోయారు. మంత్రులు ఒంటి గంటకు రావటంతో సభలో జనాలు లేక కూర్చీలు అన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి.
ఇదీ చదవండి: