ETV Bharat / city

protest on petrol price : పెరిగిన పెట్రో, డీజిల్ ధరలపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు - Andhra Pradesh News

పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు సామాన్యుల నడ్డి విరగొడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ కొనలేమని..పెంచిన ధరలను తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా వామ పక్షాలతో కలిసి నిరసనలు (CPM, CPI Statewide Protest against on Petrol and Diesel price hike) చేపట్టాయి పలు సంఘాలు.

protest on petrol price
పెరిగిన పెట్రో,డీజిల్ ధరలపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు
author img

By

Published : Oct 28, 2021, 1:13 PM IST

పెరిగిన పెట్రో,డీజిల్ ధరలపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు

పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు సామాన్యుల నడ్డి విరగొడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ కొనలేమని..పెంచిన ధరలను తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా వామ పక్షాలతో కలిసి నిరసనలు చేపట్టాయి (CPM, CPI Statewide Protest against on Petrol and Diesel price hike) పలు సంఘాలు.

కృష్ణాజిల్లా విజయవాడలో టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతున్న పన్నులను తగ్గించాలని కోరారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్‌ వద్ద సీపీఎం, సీపీఐ నేతలు పెద్ద ఎత్తున నిరసన, రాస్తారోకో చేపట్టారు. ధరలు తగ్గించకపోతే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. మహిళలతో సహా పెద్ద ఎత్తున కార్యకర్తలను అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పీ.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, వామపక్ష నేతలు సీహెచ్.బాబూరావు, డి.కాశీనాథ్, డి.శంకర్ తదితరులను పోలీసులు అరెస్ట్‌చేశారు.

కడపలో..

కడపలో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పెంచిన పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ..పెట్రోలు, డీజిల్ కొనలేము అంటూ ఆటోకు రెండువైపులా తాళ్లు కట్టి లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలకు భారత దేశాన్ని తాకట్టు పెట్టిన మోదీని తక్షణం గద్దె దించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

గుంటూరులో..

గుంటూరు శంకర్‌ విలాస్‌ కూడలి వద్ద వామపక్షాలు నిరసన తెలిపాయి. రహదారిపై కట్టెల పొయ్యి వెలిగించి నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

విశాఖలో..

విశాఖలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ లారీ యజమానులు ఆందోళన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పన్నులు పెంచుతున్నాయని ఆరోపించారు. గిట్టుబాటు ధరలు లేక తీవ్ర సంక్షోభంలో ఉన్న రవాణా రంగాన్ని ఆదుకోవాలని కోరారు.

ప్రకాశం జిల్లాలో..

ప్రకాశం జిల్లా ఒంగోలులో పెరిగిన పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను నిరసిస్తూ సీపీఐ, సీపీఎం వామపక్షాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందు ముందు సామాన్య ప్రజలు రోడ్లపై తిరిగలేరని వాపోయారు. తిరిగి సైకిళ్లు, ఎడ్లబండ్ల మీద తిరిగే దుస్థితి వస్తుందని మండిపడ్డారు... పెట్రోల్ డీజిల్ ను వెంటనే జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు.

కర్నూలు జిల్లాలో..

కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ వామపక్ష పార్టీలు ఆందోళన చేశాయి. ద్విచక్ర వాహనానికి శవయాత్ర నిర్వహించారు. నాలుగు స్తంభాల కూడలిలో ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : APCO: ఆప్కో తప్పుడు నిర్ణయాలు..రోడ్డున నేతన్నల బతుకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.