ప్రజలను మభ్యపెట్టడానికే హైపవర్ కమిటీ వేశారని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. కమిటీ అధ్యయనం ప్రారంభం కాకముందే రాజధానిగా విశాఖ అనుకూలమని మంత్రి బొత్స ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ప్రజలు ఎదురుతిరిగే రోజు వస్తుందని..ఈ ప్రభుత్వ పతనం ఇప్పటికే ప్రారంభమైందని సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి