ETV Bharat / state

'వరప్రసాద్‌' ఎంత పని చేసింది - వెతుక్కుంటూ వచ్చి మరీ - GALI VARAPRASAD NAME ISSUE IN HYD

గాలి వరప్రసాద్‌ అనే వ్యక్తి కోసం వెతుక్కుంటూ వచ్చిన ముగ్గురు వ్యక్తులు - పొరపాటున అదే పేరుగల మరో వ్యక్తిపై దాడి - కేసు నమోదు

Gali Varaprasad Name issue in Hyd
Gali Varaprasad Name issue in Hyd (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Gali Varaprasad Name Issue in Hyderabad: సినిమాల్లో మనం తరచూ చూస్తుంటాం. ఒక వ్యక్తిని వెత్తుక్కుంటూ వచ్చి అదే పేరుతో ఉన్న మరో వ్యక్తిని కొట్టడమో, సన్మానాలు చేయడమో. లేకపోతే వేధించడమో, కిడ్నాప్​లు చేయడమో లాంటి ఘటనలు చాలా సినిమాల్లో మనకు తారసపడుతుంటాయి. అచ్చం ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో వెలుగు చూసింది. ఓ వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చిన కొందరు అదే పేరు గల మరో వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత బాధితుడి ఫిర్యాదుతో అసలు కథ వెలుగులోకి వచ్చింది.

వెతుక్కుంటూ వచ్చి దాడి : పూర్తి వివరాల్లోకి వెళ్తే, కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన గాలి వరప్రసాద్‌ అనే వ్యక్తి హైదరాబాద్​లోని కేపీహెచ్‌బీ కాలనీలో ఉన్న ఓ హాస్టల్‌లో ఉంటూ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 17వ తేదీ అర్ధరాత్రి సమయంలో ముగ్గురు వ్యక్తులు వరప్రసాద్ అనే వ్యక్తిని వెతుక్కుంటూ కేపీహెచ్‌బీ కాలనీకి వచ్చారు. చివరికి ఓ హాస్టల్‌లో వరప్రసాద్ అనే వ్యక్తి ఉన్నాడని తెలుసుకున్నారు. దీంతో హాస్టల్ నిర్వాహకులు వరప్రసాద్​కు సమాచారం ఇవ్వడంతో వచ్చింది ఎవరో తెలుసుకునేందుకు హాస్టల్​ నుంచి బయటకు వచ్చాడు. వెంటనే అసలు వ్యక్తి ఎవరో అని నిర్ధారించుకోకుండానే యువతి, ముగ్గురు వ్యక్తులు ఇష్టానుసారంగా అతనిపై దాడి చేశారు. దాడిలో గాలి వరప్రసాద్ దవడకు, పెదవి లోపల గాయాలయ్యాయి.

హాస్టల్‌లో చేర్పిస్తారనే భయంతో కిడ్నాప్ డ్రామా - విస్తుపోయిన పోలీసులు

కేసు నమోదు : దీన్ని గమనించిన స్థానికులు యువకులు 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని యువతి, ముగ్గురు యువకుల వివరాలను సేకరించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు రావాలని చెప్పి అక్కడ నుంచి వెళ్లారు. కానీ దాడి చేసిన వారంతా పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా అక్కడ నుంచి పరారయ్యారు. బాధితుడు గాలి వరప్రసాద్ ప్రస్తుతం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. గాలి వరప్రసాద్‌పై దాడికి పాల్పడిన దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీంతో బాధితుడు గాలి వరప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నిందితులు వెతుకుతున్న అసలు వరప్రసాద్ అదే కాలనీలో రెండో రోడ్డులోని ఓ వసతి గృహంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

తల్లికి రోడ్డు ప్రమాదం జరిగిందని కిడ్నాప్ - చాకచక్యంగా తప్పించుకున్న బాలిక

ప్రియుడిని కిడ్నాప్ చేసేందుకు పెళ్లైన ప్రియురాలు ప్లాన్ - కానీ చివరికి ఏమైందంటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.