SI Raghava Reddy Suicide: కర్నూలు జిల్లా పోలీసు శాఖలో ఇ-కాప్ విభాగం ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న రాఘవరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. పాలకొట్టాల వీధిలో అక్షయ్ నివాస్ అపార్ట్‌మెంట్‌లోని 504 ఫ్లాట్‌లో నివాసం ఉన్న ఆయన క్రిమిసంహారక మందు తాగారు. బాధ తట్టుకోలేక బయటకు వచ్చి లిఫ్ట్ వద్ద పడిపోగా స్థానికులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు.
అనంతపురం జిల్లా నల్లమాడ మండల పరిధిలోని నల్లసింగాయగారిపల్లెకు చెందిన రాఘవరెడ్డి 1991లో ఎస్సైగా చేరి జిల్లాలో పనిచేశారు. కొన్ని కారణాలతో పదోన్నతికి దూరమై ఎస్సై హోదాలోనే ఉండిపోయారు. అతని బ్యాచ్ పోలీసు అధికారులంతా డీఎస్పీ హోదాలో ఉండగా ఆయనకు పదోన్నతి రాకపోవడంతో బాధపడుతూ ఉండేవారు. జిల్లాలో ఇ-కాప్ విభాగం, సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇన్‌ఛార్జిగా వ్యవహరించేవారు. ఆయనకు భార్య రాధిక, ఇద్దరు కుమారులు ఉన్నారు. మానసిక కుంగుబాటుకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు అధికారులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన మృతి పట్ల అధికారులు, సిబ్బంది విచారం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి..:
HUSBAND WIFE DIED : అనారోగ్యంతో భర్త మృతి...తట్టుకోలేక గుండెపోటుతో భార్య కన్నుమూత