ETV Bharat / city

Brahmotsavam in srisailam : ఫిబ్రవరి 22 నుంచి శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు - Brahmotsavam

శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో ఫిబ్రవరి 22 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ మేరకు ఈవో ఎస్‌.లవన్న వివరాలు వెల్లడించారు.

శివరాత్రి బ్రహ్మోత్సవాలు
శివరాత్రి బ్రహ్మోత్సవాలు
author img

By

Published : Jan 23, 2022, 7:13 AM IST

శ్రీశైల మహాక్షేత్రంలో వచ్చే నెల 22వ తేదీ నుంచి మార్చి 4 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని ఈవో ఎస్‌.లవన్న తెలిపారు. ఉత్సవాల సమయంలో ముందస్తుగా గదుల రిజర్వేషన్‌ చేసుకునే సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్లు ఈవో తెలిపారు. కుటీర నిర్మాణ పథకం కింద వసతిగదులు నిర్మించిన దాతలకు మాత్రం గతంలోలాగా ముందస్తు రిజర్వేషన్‌ ఉంటుందన్నారు. దాతలు వసతి పొందేందుకు ఫిబ్రవరి 10వ తేదీలోగా దేవస్థానం కార్యాలయానికి లిఖితపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత వచ్చిన లేఖలను పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదని పేర్కొన్నారు.

ఇదీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.