కృష్ణా నది జలాల నుంచి సంగమేశ్వర ఆలయం బయటకు వచ్చింది. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండల పరిధిలో నాలుగు నెలలు మాత్రమే ఇక్కడ స్వామి భక్తులకు దర్శనమిస్తారు. స్థానికులు ఆలయ ఆవరణలో ఉన్న నీటిని తొలగించి శుభ్రం చేస్తున్నారు. నదీ గర్భంలో ఉన్న సంగమేశ్వర స్వామి ఆలయంలోని శివలింగాన్ని ధర్మరాజు ప్రతి ష్ఠించాడని ప్రసిద్ధి. ఇక్కడ శివలింగం ఎనిమిది నెలలపాటు నీటిలో ఉన్నప్పటికీ ఆకారం ఏమాత్రం మారకుండా ఉండటం విశేషం. ఆలయం బయట పడిందన్న విషయాన్ని తెలుసుకున్న భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే ఈ ఆలయం ఆగష్టు నుంచి మార్చి వరకు ఎనిమిది నెలలుపాటు నీటిలో మునిగి ఉండటం విశేషం.
ఇవీ చూడండి: