పోలీసులు కొట్టడంవల్లే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ తూర్పు గోదావరి జిల్లా మండపేటలో మృతదేహంతో బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున ఆందోళ నిర్వహించారు. బాధ్యులైన పోలీసుల్ని తమకు అప్పగించాలంటూ... నాలుగు గంటలపాటు చేపట్టిన ఆందోళనతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. చివరకు బాధ్యుడైన సీఐపై చర్యలు తీసుకున్నట్టు అధికారులు ప్రకటించడంతో ఆందోళన విరమించారు. మండపేటకు చెందిన ప్రగడ కాళీకృష్ణ భగవాన్ తండ్రితోపాటు వ్యవసాయం చేస్తున్నాడు. సమీపంలోని బాలికను ప్రేమిస్తున్నాడు. తమ కుమార్తెను వేధిస్తున్నట్టు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. టౌన్ స్టేషన్ సీఐ కాళీని స్టేషన్ కు పిలిచి విచారణ చేపట్టారు. విచారణలో పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని.... తీవ్రంగా గాయపడ్డాడని బంధువులు ఆరోపించారు. మంగళవారం ఉదయం ఇంటిని రాలేదని....ఏడిద రోడ్డులో చనిపోయి ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని, సీఐ దుర్గాప్రసాద్ ని తమకు అప్పగించాలంటూ....కలువ పువ్వు సెంటర్ లో ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి తెలిపారు. సీఐ దుర్గాప్రసాద్ ను వీఆర్‌కు పంపుతున్నట్టు ప్రకటించారు. సీఐ సహా మరో ముగ్గురిపై కేసు నమోదు చేస్తున్నట్టు చెప్పడంతో ఆందోళన విరమించారు.
Accident : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం బత్తలూరులో ప్రమాదం జరిగింది. నూర్పిడి యంత్రాన్ని ఢీకొట్టిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 9మందికి గాయాలయ్యాయి.
ఓవర్ టేక్ చేస్తుండగా..
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు క్లీనర్ మృత్యువాత పడ్డాడు. బస్సులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆర్టీసీ స్లీపర్ బస్సు ...లారీని క్రాస్ చేసే క్రమంలో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి :