ASI Protest: రిటైర్మెంట్ అయ్యి సంవత్సరం కావస్తున్నా.. ఇంత వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదని ఆవేదనతో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఓ పోలీసు ఆందోళన చేపట్టాడు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన నాగరాజు ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ గత ఏడాది రిటైర్మెంట్ అయ్యారు.
అయితే.. ఇంతవరకు తనకు రావాల్సిన బకాయిలు, పెన్షన్ రావడం లేదని కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపాడు. పెన్షన్ సైతం రాకపోవడంతో కుటుంబ పోషణ భారమైందని ఏఎస్ఐ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పందించి వెంటనే తనకు రావాల్సిన బెనిఫిట్స్, పెన్షన్ మంజూరు చేయాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి: కొవిడ్ సెంటర్లకు ఆహార బిల్లుల చెల్లింపులు.. హైకోర్టుకు హాజరైన అనిల్ సింఘాల్