ETV Bharat / city

ఆసుపత్రిలో ఇద్దరు మృతి.. వైద్యుల నిర్లక్ష్యమేనంటూ ఆందోళన - kurnool latest news

కర్నూలులోని జీవన్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైద్యశాలలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మృతుల బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.

వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆందోళన

author img

By

Published : Sep 30, 2021, 7:42 PM IST

తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు గ్రామానికి చెందిన అన్నపూర్ణ.. కాన్పు కోసం నగరంలోని జీవన్ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు వారం రోజుల క్రితం వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ చేశారు. శిశువును ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. శస్త్రచికిత్స అనంతరం పేగులు మడతపడ్డాయని అన్నపూర్ణకు మరో ఆపరేషన్ చేయగా.. అది వికటించి మరణించారని బాధితురాలి బంధువులు తెలిపారు.

మరో ఘటనలో వెల్దుర్తి మండలం పుల్లగుమ్మికి చెందిన నవీన్ కుమార్ కాలికి ఇన్​ఫెక్షన్ అవడంతో ఇదే ఆస్పత్రిలో చేరారు. శస్త్రచికిత్స చేసిన అనంతరం నవీన్ కుమార్ మరణించాడని బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆసుపత్రిలో ఇద్దరు పేషెంట్లు చనిపోతే యజమాన్యం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ... మృతుల కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న రెండో పట్టణ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆస్పత్రిపై కేసు నమెదు చేశారు.

ఇదీచదవండి.

Somu Met Pawan: పవన్​తో సోము వీర్రాజు భేటీ.. బద్వేలు ఉప ఎన్నికపై చర్చ !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.