ETV Bharat / city

చంద్రబాబు కరకట్ట ఇల్లు ఖాళీచేసి బయటకు రావాలి : మంత్రి అనిల్ కుమార్ - minister buggana latest news

తెదేపా అధినేత చంద్రబాబు..కరకట్ట ఇళ్లు ఖాళీ చేసి వేరే ఇళ్లు తీసుకోవాలని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. వర్షాలకు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు నిండాయన్నారు. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడం వల్ల ప్రకాశం బ్యారేజి నిండిందన్నారు. కేవలం 3 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రకాశం బ్యారేజి వరద ఎక్కువగా ఉందన్నారు. కరకట్ట ఇళ్లలోకి వరద వచ్చే అవకాశం ఉందన్నారు.

minister anil kumar yadav
minister anil kumar yadav
author img

By

Published : Oct 16, 2020, 4:27 PM IST

Updated : Oct 16, 2020, 7:01 PM IST

తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లను కర్నూలు జిల్లా ఇన్​ఛార్జి మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరిశీలించారు. కర్నూలులోని పుష్కర ఘాట్లను సందర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

తుంగభద్ర పుష్కర ఏర్పాట్లపై మంత్రులు  పరిశీలన

తుంగభద్ర పుష్కరాలకు రూ.200 కోట్లు

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడతామని... జలవనరుల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. కర్నూలులో పర్యటించిన ఆయన తుంగభద్ర పుష్కరాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గుండ్రేవుల, రాజోలిబండ ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు గుర్తు చేశారు. గుండ్రేవుల ప్రాజెక్టుపై తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలతో మాట్లాడాల్సి ఉందన్నారు. రాయలసీమ కరవు నివారణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ప్రకాశం జిల్లాలో 15 టీఎంసీల నీటి నిల్వ కోసం మూడు బ్యారేజీల నిర్మాణాలు, గోదావరి నీటిని రాయలసీమకు తరలించటం తదితర కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం సామర్థ్యాన్ని 6 వేలకు పెంచుతున్నట్లు చెప్పారు. తుంగభద్ర పుష్కరాల కోసం 2 వందల కోట్ల రూపాయలు కేటాయించామని... కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తామన్నారు.

చంద్రబాబు కరకట్ట నుంచి బయటకు రావాలి

తెదేపా అధినేత చంద్రబాబు తన ఇంటిని ఇప్పటికైనా ఖాళీ చేయాలని మంత్రి హితవు పలికారు. ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల ప్రకాశం బ్యారేజి పూర్తిగా నిండిందన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారని తెలిపారు. వరద ఉద్ధృతితో కరకట్ట మీద ఇళ్లు మునుగుతున్నాయని అన్నారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని మంత్రి అనిల్ కుమార్ హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి :

కృష్ణా నదికి వరద ప్రవాహం పెరిగే అవకాశం: గుంటూరు కలెక్టర్

Last Updated : Oct 16, 2020, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.