కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నందున జిల్లా అధికారులతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష సమావేశం నిర్వహంచారు. జిల్లాలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ వీరపాండియన్, వైద్య అధికారులతో చర్చించారు. రెడ్ జోన్ల పై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రజలు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని సామాజిక దూరం పాటించి లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి:
హైదరాబాద్లో కూర్చొని ప్రభుత్వంపై విమర్శలా?: శ్రీకాంత్ రెడ్డి