కర్నూలు జిల్లా చాగలమర్రిలో ముత్యాలపాడు బస్టాండ్ సమీపంలో విషాదం చోటు చేసుకుంది. వదినా మరుదులు స్వల్ప వ్యవధిలో బలవన్మరణానికి పాల్పడిన ఘటన.. సంచలనం సృష్టించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వివాహిత నాగూర్ బీ (38) ఫ్యానుకు ఉరి వేసుకుని చనిపోయింది. గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు చెప్పారు. ఈ విషయం తెలిసిన కాసేపటికే.. ఆమె మరిది షేక్ హుస్సేన్ బాషా (36).. అదే ఫ్యానుకు ఉరి వేసుకుని చనిపోయాడు. స్థానికంగా.. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి...