కర్నూలు, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజుకు 300 వరకు కరోనా నిర్థరణ పరీక్షలు చేస్తున్నట్టు కలెక్టర్ వీరపాండియన్ చెప్పారు. వీటికి ట్రూనాట్ పరికరాలు వినియోగిస్తున్నట్టు తెలిపారు. పరీక్షల కోసం ఎవరూ నేరుగా వెళ్లకూడదని.. స్థానిక ప్రభుత్వ వైద్య అధికారి సూచించిన వారికే పరీక్షలు చేస్తారని స్పష్టం చేశారు. నమూనాల సేకరణకు మొబైల్ టీమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. పకడ్బందీగా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: