ETV Bharat / city

అంగన్వాడీలో కుమారుడిని చేర్చి.. అందరికీ ఆదర్శంగా నిలిచి - Kurnool Collector P Koteswara Rao joined his son in Anganwadi pre school

Collector son at Anganwadi school: ఆయన ఆ జిల్లాకు పాలనాధికారి. కోరుకుంటే కుమారుడ్ని పెద్ద కార్పొరేట్ స్కూల్​కే పంపగలరు. కానీ.. ప్రభుత్వ పాఠశాల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని నమ్మకం. అందుకే తమ కుమారుడ్ని అంగన్వాడీ ప్రి స్కూల్​కు పంపుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయనే కర్నూలు జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు.

Collector son joined at Anganwadi school

author img

By

Published : Jun 4, 2022, 4:58 PM IST

Collector son joined to Anganwadi school: చదువు.. ఈ రోజుల్లో పిల్లల చదువుకు తల్లిదండ్రులు ఎంతో ప్రాధాన్యమిస్తున్న అంశం. తమ పిల్లల చదువు కోసం ఎంతైనా ఖర్చు చేస్తున్నారు.. అవసరమైతే అప్పు చేసి మరీ ప్రైవేట్​ స్కూళ్లలో చదివిస్తున్నారు. కానీ ప్రభుత్వం ఎన్నో నిధులు వెచ్చించి.. క్వాలిఫైడ్​ టీచర్లను నియమించినా ప్రభుత్వ పాఠశాలల వైపు ఎవరూ చూడడం లేదు. ఎందుకంటే అక్కడ సరిగ్గా చదువు చెప్తారో లేదోనని అనుమానం. తమ పిల్లల భవిష్యత్​ ఏమవుతుందోనన్న భయం. మరోవైపు తమ ఇంటి పక్కన వేరే పిల్లలు మంచి స్కూళ్లలో చదువుతుంటే... తమ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివితే.. సమాజంలో విలువ ఇవ్వరనే భావంతో ప్రైవేట్​ స్కూళ్ల వైపే తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. అయితే వీటన్నింటికి భిన్నంగా జిల్లా పాలనాధికారి అయిన కలెక్టర్​ తమ కుమారుడిని అంగన్వాడీ ప్రిస్కూలుకు పంపించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

ఆయన తలచుకుంటే ఎంత డబ్బు ఖర్చు చేసైనా కార్పొరేట్​ స్కూలులో చేర్పించవచ్చు. కానీ అలా చేయలేదు.. కార్పొరేట్​ స్కూళ్ల కన్నా ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య బోధిస్తారన్న ఉద్దేశంతో తమ కుమారుడిని బుధవారపేట అంగన్వాడీ కేంద్రంలో చేర్పించారు కర్నూలు జిల్లా కలెక్టర్​ పి.కోటేశ్వరరావు.

అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పౌష్టికాహారంతోపాటు.. ఆటపాటలతో విద్యనందిస్తున్నామని ఐసిడిఎస్ అధికారులు తెలిపారు. కలెక్టర్ కుమారుడు అరవింద్ తోటి చిన్నారులతో కలిసి బొమ్మలతో ఆటలాడాడు.

అంగన్వాడీ కేంద్రంలో కుమారుడిని చేర్చి... ఆదర్శంగా నిలిచిన అధికారి...

ఇవీ చదవండి :

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.