కర్నూలు నగరంలో కరోనాతో మృతి చెందిన వైద్యుడి వద్ద చికిత్స పొందిన రోగులను, వారి బంధువులను గుర్తించే పనిలో ఉన్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు తెలిపారు. నగరంలో కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి జోన్లుగా విభజిస్తున్నామని చెప్పారు. వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఇదీ చదవండి: