ETV Bharat / city

IT RAIDS: స్కందాన్షి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ కార్యాలయాల్లో.. ఐటీ సోదాలు

author img

By

Published : Jan 5, 2022, 7:56 PM IST

IT RAIDS: దక్షిణ భారతదేశంలోని స్కందాన్షి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ సంస్థ కార్యాలయాల్లో.. ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా.. కర్నూలు, అనంతపురం కార్యాలయాల్లో అధికారులు దాడులు చేశారు.

IT RAIDS ON SKANDHANSHI INFRA PROJECTS offices in ap

IT RAIDS ON SKANDHANSHI OFFICES: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ.. స్కందాన్షి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్​పై ఆదాయపన్ను శాఖ అధికారులు రైడ్ చేశారు. కర్నూలు నగరంలోని ఆ సంస్థ కార్యాలయాల్లో ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఈ దాడులు కొనసాగుతున్నందున.. కార్యాలయంలోకి ఇతరులెవ్వరినీ అనుమతించటం లేదు.

అనంతపురంలోనూ..
అనంతపురంలోని స్కందాన్షి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్​ కంపెనీ కార్యాలయంలోనూ.. ఐటీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కర్నూలు అధికారులు.. అనంతపురంలో తనిఖీలు చేపట్టారు.

సంస్థ లావాదేవీలకు సంబంధించిన వివరాలు, రికార్డులను పరిశీలించారు. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ సంస్థకు సంబంధించి దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని కార్యాలయాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:
LAKKASAGARAM PUMP HOUSE: లక్కసాగరం పంప్​హౌస్ పరిశీలించిన ఆర్థిక మంత్రి బుగ్గన

CAR ACCIDENT: జాతీయ రహదారిపై కారు బోల్తా...ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.