ETV Bharat / city

ప్లాస్మా థెరపీ విధానం.. కరోనా బాధితులకు వరం..

author img

By

Published : Jun 25, 2020, 4:36 PM IST

కరోనాతో బాధపడుతూ... మృత్యువుతో పోరాడే రోగులను ప్లాస్మా థెరపీ ద్వారా బతికించుకునే వీలుంది. ఇప్పటికే ఈ థెరపీపై దేశంలో బాగా చర్చ జరుగుతోంది. కరోనా వైరస్ విజృంభిస్తున్నవేళ... కర్నూలు సర్వజన వైద్యశాలలో... ప్లాస్మా థెరపీని ప్రారంభించేందుకు ఐసీఎంఆర్ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో కర్నూలు జీజీహెచ్​కు ప్రత్యేక గుర్తింపు లభించినట్లైంది.

ప్లాస్మా థెరపీ విధానం.. కరోనా బాధితులకు వరం..
ప్లాస్మా థెరపీ విధానం.. కరోనా బాధితులకు వరం..

రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రతి రోజు సరాసరిన 50కి పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో 1,555 మందికి వైరస్​ సోకినట్లు అధికారులు తెలిపారు. కరోనా విజృంభణ దృష్ట్యా.. ఇప్పటికే మూడు కొవిడ్​ ఆస్పత్రులను ఏర్పాటు చేశారు. కర్నూలు సర్వజన వైద్యశాల, నంద్యాల సమీపంలోని శాంతిరాం ఆస్పత్రి, కోడుమూరు మార్గంలోని విశ్వభారతి ఆసుపత్రుల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే 44 మంది కరోనాతో బాధపడుతూ... మృత్యువాతపడ్డారు. ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • ప్లాస్మా థెరపీకి అనుమతి

కరోనాతో బాధపడుతూ... వెంటిలేటర్​పై ఉన్న రోగులకు ప్లాస్మా థెరపీ చేయటం ద్వారా బతికించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​) ఆమోదించింది. మన రాష్ట్రంలో తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి ఇప్పటికే అనుమతి లభించింది. తాజాగా... కర్నూలు సర్వజన వైద్యశాలలో ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయిల్స్​కు ఆమోదం తెలపటంతో వైద్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలో 60 ఆస్పత్రులకు అనుమతులు వచ్చాయి. ఈ థెరపీ ద్వారా రోగులను బతికించుకునేందుకు అవకాశం ఉందని... కరోనాతో కోలుకున్న రోగులు ప్లాస్మాను ఇచ్చేందుకు ముందుకు రావాలని వైద్యులు సూచిస్తున్నారు.

  • 9 మంది నుంచి ప్లాస్మా సేకరణ

కర్నూలు సర్వజన వైద్యశాలలో ఇప్పటికే 9 మంది నుంచి వైద్యులు ప్లాస్మా సేకరించారు. కరోనా నుంచి కోలుకున్న యువత ముందుకు వచ్చి... ప్లాస్మా ఇస్తే... మరికొందరి ప్రాణాలు కాపాడేందుకు వీలవుతుందని చెబుతున్నారు.

ఇదీ చూడండి..: జీతం లేక.. కూలి పనులు చేస్తున్న అధ్యాపకుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.