ETV Bharat / city

జిల్లాలో విస్తారంగా వర్షాలు.. ఆనందంలో అన్నదాత - కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు

అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమైంది. నింగికి చిల్లు పడినట్లుగా భారీ వర్షం కురిసింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఏకధాటిగా వర్షం పడటంతో వాగులు, వంకలు ఉప్పొంగాయి. నదులు జలకళను సంతరించుకున్నాయి. పలు ప్రాంతాల్లో వరద నీరు రావడంతో జనం ఇబ్బందులు పడ్డారు. రహదారులపై నీరు పెద్దఎత్తున ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. ఆశాజనకంగా వర్షాలు పడుతుండటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పొలం పనులు చేసుకొనేందుకు సిద్ధమవుతున్నారు.

heavy rain
heavy rain
author img

By

Published : Jun 29, 2020, 12:04 PM IST

కర్నూలు జిల్లాలోని పలు మండలాల్లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. మొత్తం 40 మండలాల్లో వర్షం పడింది. కొలిమిగుండ్ల, కర్నూలు, ప్యాపిలి, కల్లూరు మండలాల్లో వంకలు పొంగి పొర్లాయి. కొలిమిగుండ్ల మండలంలో అత్యధికంగా 93.4 మి.మీ.లు (9.3 సెంటీమీటర్లు) పడింది. కర్నూలులో 80.2 మి.మీ.లు, ప్యాపిలి 67.2, కల్లూరు 66, కృష్ణగిరి 40.6, సంజామల 36.8, బనగానపల్లి 35.2, నందవరంలో 32.2 మి.మీ.లుగా నమోదైంది.

శిరువెళ్లలో 31.4 మి.మీ.లు, ఆస్పరి 31.2, వెల్దుర్తి 28.2, సి.బెళగల్, బేతంచర్ల, గోస్పాడు 24.2, ఆదోని, పాణ్యం 20, చాగలమర్రి 19, పెద్దకడబూరులో 18.6 మి.మీ.లు కురిసింది. గోనెగండ్ల 18.4, కోసిగి 14.8, ఉయ్యాలవాడ 14.6, కౌతాళం, మిడుతూరు 14.2, వెలుగోడు 14, కోవెలకుంట్ల, హాలహర్వి 11.2, ఎమ్మిగనూరు, బండి ఆత్మకూరు 10.2, గూడూరు, డోన్‌ 10, మంత్రాలయం 9.8, శ్రీశైలంలో 9.2 మి.మీ.లుగా నమోదైంది. ఇతర ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. మొత్తం 40 మండలాల్లో 897 మిల్లీమీటర్ల వర్షం కురవగా జిల్లా సగటున ఒక్కరోజే 16.6 మి.మీ.లు నమోదవడం విశేషం. ఈనెల సాధారణ వర్షపాతం 77.2 మి.మీ.లు కాగా ఇప్పటివరకు 131.7 మి.మీ.లుగా నమోదైంది. సాధారణానికి మించి 71 శాతం అధిక వర్షం పడింది.

ఇదీ చదవండి:

'వ్యాపార అవసరాల కోసమే జగన్​కు అమరావతి గుర్తుకొస్తుందా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.