శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జలాశయం ఇన్‌ఫ్లో 1,92,035 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయ గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు... కాగా ప్రస్తుత నీటిమట్టం 849.9 అడుగులకు చేరింది. జలాశయంలో గరిష్ఠ నీటినిల్వ 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటినిల్వ 77.85 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం ఎడమ విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేసి 31,783 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు.
ఇదీ చదవండి: శ్రీశైలానికి భారీ వరద..మునుగుతున్న సంగమేశ్వరం ఆలయం