కర్నూలు జిల్లాలో వైకాపాకు గట్టి దెబ్బ తగిలింది. పాణ్యం శాసన సభ్యురాలు గౌరుచరితా దంపతులు పార్టీ సభ్యత్వానికి... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. వీలైతే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలుస్తామని... 9న తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. తమ కార్యకర్తలను, ముఖ్య అనుచరులను కాపాడుకునేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్నామని గౌరు చరిత వెల్లడించారు.వైకాపాకు ఎన్నో సేవలందిస్తే... ఈ సారి సీటు ఇవ్వలేనని జగన్ చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే సీటు రాకపోతే స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తామని గౌరు వెంకటరెడ్డిస్పష్టం చేశారు.
వైకాపాను వీడిన గౌరు దంపతులు - tdp
ఈ నెల 9న తెదేపాలోకి చేరనున్నట్లు గౌరు దంపతులు ప్రకటించారు. ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకుండా ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్న జగన్ మాటలకు మనస్థాపం చెంది వైకాపా వీడుతున్నామని వెల్లడించారు. పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు గౌరు చరితారెడ్డి.
![వైకాపాను వీడిన గౌరు దంపతులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2583141-388-2e0f1d68-ce1f-42c8-8ef4-20ceae0bd388.jpg?imwidth=3840)
రాజీనామా పత్రాలను చూపుతున్న గౌరు దంపతులు
కర్నూలు జిల్లాలో వైకాపాకు గట్టి దెబ్బ తగిలింది. పాణ్యం శాసన సభ్యురాలు గౌరుచరితా దంపతులు పార్టీ సభ్యత్వానికి... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. వీలైతే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలుస్తామని... 9న తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. తమ కార్యకర్తలను, ముఖ్య అనుచరులను కాపాడుకునేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్నామని గౌరు చరిత వెల్లడించారు.వైకాపాకు ఎన్నో సేవలందిస్తే... ఈ సారి సీటు ఇవ్వలేనని జగన్ చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే సీటు రాకపోతే స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తామని గౌరు వెంకటరెడ్డిస్పష్టం చేశారు.
సైకిలెక్కనున్న గౌరు దంపతులు
sample description
Last Updated : Mar 2, 2019, 7:02 AM IST