ఠాణా ఎదుట మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆందోళన - undefined
కర్నూలు జిల్లా చాగలమర్రి పోలీస్ స్టేషన్ ఎదుట తెదేపా నేత , మాజీ మంత్రి భూమా అఖిల ప్రియా ఆందోళన చేపట్టారు. స్థానిక ఎన్నికల్లో తెదేపా తరఫున పోటీ చేసిన ఓ ఎంపీటీసీ అభ్యర్థి కుటుంబ సభ్యులపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారంటూ ఆమె ఠాణాలో ఎస్ఐ వీరయ్యతో వాగ్వాదానికి దిగారు. తమ కార్యకర్తల పట్ల ఎస్సై అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. కేసు నమోదు కాబడిన అభ్యర్థి కుమారులైన హుస్సేన్ ,చోటు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ అఖిల, ఆమె సోదరుడు భూమా జగద్విఖ్యాతరెడ్డి, భర్త భార్గవ్ రామ్నాయుడు తెదేపా నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్ఐ వారికి నచ్చజెప్పి స్టేషన్లోకి తీసుకుని వెళ్లారు.
Former minister Bhuma Akhila Priya hesitation in front of PS