ఆరుగాలం కష్టించి పండించిన ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లేదని.. ఓ రైతు గుండె మండింది. తీవ్ర ఆవేదనతో కంటికి రెప్పలా కాపాడుకున్న పంటకు.. మార్కెట్ సాక్షిగా నిప్పు పెట్టాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.
పంచలింగాల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే రైతు.. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు ఉల్లిపాయలు తెచ్చారు. ఈ-నామ్ పద్ధతిలో కేవలం 350 ధర పలకడంతో ఆగ్రహించిన రైతు ఉల్లిగడ్డలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు.
అధికారులు స్పందించి 500 రూపాయలు ఇస్తామని చెప్పినా.. అతడు సంతృప్తి చెందలేదు. చివరకు 700 రూపాయలకు అమ్మినట్లు రైతు తెలిపారు. ఉల్లి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: kanna babu on CBN: జగన్‌ను గద్దె దించడమే.. లక్ష్యంగా దుష్ప్రచారం : కన్నబాబు