Junior NTR birthday: జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను కర్నూలులో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘాల ఆధ్వర్యంలో కర్నూలులోని పలు ప్రాంతాల్లో రక్తదానం, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు. సేవా కార్యక్రమాలు చేస్తున్న అభిమానులను అభినందించారు.
సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు నంద్యాలలోనూ ఘనంగా జరిగాయి. నందమూరి అభిమాన సంఘం అధ్యక్షుడు మహబూబ్ వలి ఆధ్వర్యంలో రామనాథ్ థియేటర్ ఆవరణలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అభిమానుల కోసం ప్రత్యేకంగా థియేటర్లో 'ఆది' చిత్రాన్ని ప్రదర్శించారు. అనారోగ్యంతో మృతి చెందిన ఎన్టీఆర్ అభిమాని కుటుంబానికి రూ.20 వేలు ఆర్థిక సాయం చేశారు. థియేటర్ సిబ్బందికి బియ్యం బస్తాలు అందజేశారు. ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఇవీ చదవండి: