CPI Ramakrishna: కర్నూలు జిల్లా ఆదోనిలో వారం రోజుల క్రితం ఓ కేసు విషయంలో.. సీపీఐ మండల కార్యదర్శి విరుపాక్షితోపాటు మరో ఇద్దరిని ఏస్ఐ విచక్షణ రహితంగా కొట్టారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బాధితులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆస్పరి ఎస్సై మునీ ప్రతాప్ ఎలా ఎస్ఐగా కొనసాగుతున్నాడని మండిపడ్డారు.
CPI Ramakrishna: పోలీసులు బట్టలు విప్పించి కొట్టడానికి ఉన్నారా? అని ప్రశ్నించారు. ఇలా చేస్తే ప్రజలకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం ఎలా కలుగుతుందని నిలదీశారు. ఇంత జరుగుతుంటే.. పోలీసు ఉన్నతాధికారులు నిద్రపోతున్నారా? అని అన్నారు. అన్యాయంగా దాడిచేసిన ఎస్సైని డిస్మిస్ చేయకపోతే.. ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇంత జరిగినా.. సీఎం స్పందించకుండా అసెంబ్లీ సమావేశాలు ఎలా నడుపుతున్నారని ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. లేకపోతే.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: Lokesh On Pegasus: పెగాసస్‌పై ఎలాంటి విచారణకైనా సిద్ధం: నారా లోకేశ్