ETV Bharat / city

CPI NARAYANA : 'అమరావతి రైతు ఉద్యమానికి ఆటంకం కలిగిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా జైల్ భరో' - amaravati farmers protest

అమరావతి రైతుల మహాపాదయాత్రకు(amaravati farmers padhayatra) ఆటంకాలు కలిగిస్తే... రాష్ట్రవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమానికి పిలుపునిస్తామని సీపీఐ నాయకుడు నారాయణ(CPI leader narayana) హెచ్చరించారు. ప్రత్యేక హోదా(special status) ఇస్తామని చెప్పి, భాజపా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీపీఐ నాయకుడు నారాయణ
సీపీఐ నాయకుడు నారాయణ
author img

By

Published : Nov 8, 2021, 3:50 PM IST

శాంతియుతంగా జరుగుతున్న అమరావతి రైతుల ఉద్యమానికి(amaravati farmers protest) ఆటంకాలు కలిగిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమానికి(jail bharo) పిలుపునిస్తామని సీపీఐ నాయకుడు నారాయణ(CPI leader narayana) హెచ్చరించారు. కర్నూలులో జరుగుతున్న శాఖా కార్యదర్శుల వర్క్​షాప్​ను ఆయన ప్రారంభించారు. అమరావతి ఉద్యమంలో అసాంఘిక శక్తులు లేవని, అధికార వైకాపాలో రౌడీలు, గూండాలు ఉన్నారని నారాయణ ఆరోపించారు. ప్రత్యేక హోదా(special status) ఇస్తామని చెప్పి, భాజపా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 14న తిరుపతి పర్యటనకు వస్తున్న కేంద్రమంత్రి అమిత్ షా(amit shah tirumala tour) ను అడ్డుకుంటామని వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ రేట్లను భారీగా పెంచి, కేవలం 5 రూపాయలు తగ్గించారని ఎద్దేవా చేశారు. అదానీ పోర్టుల ద్వారానే దేశంలోకి మాదకద్రవ్యాలు వస్తున్నాయని సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు.

అమరావతి రైతు ఉద్యమానికి ఆటంకం కలిగిస్తే జైల్ భరో కార్యక్రమానికి పిలుపునిస్తాం. అమరావతి రైతుల్లో అసాంఘిక శక్తులు ఏమీ లేవు. శాంతియుత ఉద్యమంపై నిందలు సరికాదు. అధికార వైకాపాలోనే రౌడీలు, గూండాలు ఉన్నారు. ఈనెల 14న అమిత్ షా తిరుపతి పర్యటన అడ్డుకుంటాం. - నారాయణ, సీపీఐ నేత నారాయణ

సీపీఐ నాయకుడు నారాయణ

మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి...

న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులపై కేసులు పెట్టడాన్ని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తప్పుబట్టారు. ఈ చర్యతో ప్రభుత్వం తన గొయ్యి తానే తవ్వుకుంటోందని మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్న న్యాయబద్ధమైన డిమాండ్ తో రైతులు చేపట్టిన పాదయాత్రకు అవాంతరాలు సృష్టించడం సరికాదన్నారు. పాదయాత్రకు ఆంక్షలు విధించడం, మద్ధతు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికమని అభిప్రాయపడ్డారు. రైతుల పాదయాత్ర ముగిసేలోపు మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అమరావతి రైతుల మహాపాదయాత్ర...

600 రోజులకు పైబడి అప్రతిహతంగా సాగుతున్న దీక్ష.. కేవలం పాతిక ఊళ్లకే పరిమితమైందన్నారు. కానీ.. ఇవాళ మొదలుపెట్టిన పాదయాత్ర(Amaravati padayatra).. కడలి తరంగమై ఉవ్వెత్తున ఎగసిపడుతోందని, ఆ సజీవ సాక్ష్యాన్ని చూడమని కోరుతున్నారు రైతులు. రాజధాని అమరావతిపై జనాల్లో ఉన్న ఆశ, ఆకాంక్ష స్థాయి ఏంటన్నది రైతులు, మహిళల పాదయాత్ర బయటపెడుతోందని అంటున్నారు. దారిపొడవునా పూల స్వాగతం. జనాల నీరాజనమే అమరావతిపై వారికున్న ప్రేమను చాటిచెబుతున్నాయి. అధికార పక్షం మినహా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల సంపూర్ణ మద్దతుతో అమరావతి మహా పాదయాత్ర రణన్నినాదాన్ని తలపిస్తూ దిక్కులు పిక్కటిల్లేలా ఉద్యమ శంఖారావం చేస్తూ ముందుకు సాగుతోంది.

పట్టుసడలని ఉద్యమం...

అవును మరి. ముప్పై వేల ఎకరాలకు పైబడిన మూడు పంటలు పండే భూములను తమ భవిత కోసం.. కాదు కాదు రాష్ట్ర భవిష్యత్ కోసం సమర్పించారు. కష్టం నష్టం ఎదురైనా మన రాజధాని కోసం-మన రాష్ట్రం కోసమేనని భరించారు. కానీ.. అర్థంతరంగా రాజధాని మార్చేస్తున్నట్టు ప్రకటించడంతో కలలు కల్లలయ్యానని, తాము చేసిన త్యాగాలకు అర్థమే లేకుండా పోయిందన్నది సగటు అమరావతి రైతు వేదన. అందుకే రోజులు.. నెలలు.. సంవత్సరాలు గడిచిపోతున్నా.. మొక్కవోని, పట్టుసడలని ఉద్యమం కొనసాగిస్తున్నారు. రాజు మారినప్పుడల్లా.. రాజధానిని వెంటబెట్టుకెళ్లిన తుగ్లక్ తీరును అంగీకరించేది లేదని, ఆమోదించేది లేదని పోరుబాట పట్టారు.

ఇవీచదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.