కర్నూలు జిల్లాలోని అన్ని పట్టణాలు, మండలాల్లో కరోనా వ్యాపించింది. ఒకే రోజులో 590 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో కేసుల సంఖ్య 4816కు చేరింది. ఇప్పటి వరకు కర్నూలు నగరంలో 1559 మందికి, కర్నూలు గ్రామీణ ప్రాంతంలో 35 మందికి కరోనా సోకింది. నంద్యాల పట్టణంలో అత్యధికంగా 805, నంద్యాల గ్రామీణ ప్రాంతంలో 52, ఆదోని పట్టణంలో 594, ఆదోని గ్రామీణ ప్రాంతంలో 68, డోన్ పట్టణం 168, డోన్ గ్రామీణ ప్రాంతంలో 28, ఎమ్మిగనూరు పట్టణంలో 158, ఎమ్మిగనూరు గ్రామీణ ప్రాంతంలో 20, ఆత్మకూరు పట్టణంలో 136, ఆత్మకూరు గ్రామీణ ప్రాంతంలో 13, బనగానపల్లి 101, నందికొట్కూరు పట్టణం 95, నందికొట్కూరు గ్రామీణ ప్రాంతంలో 8 మందికి కోరనా సోకింది.
కోడుమూరు 101, పాణ్యం 73, అవుకు 63, పత్తికొండ 52, శిరివెళ్ల 36, ఆళ్లగడ్డ పట్టణం 33, ఆళ్లగడ్డ గ్రామీణ ప్రాంతం 2, కౌతాళం 31, దేవనకొండ 31, ప్యాపిలి 27, గోస్పాడు 27, పెద్దకడుబూరు 24, తుగ్గలి 24, వెల్దుర్తి 24, కోవెలకుంట్ల 22, బండి ఆత్మకూరు 21, నందవరం 20, ఆలూరు 20, గడివేముల 20, మిడుతూరు 19, పాములపాడు 19, కల్లూరు 18, మద్దికెర 18, గోనెగండ్ల 18, బేతంచర్ల 17, బేతంచర్ల గ్రామీణ ప్రాంతం 8, గూడూరు 17, చాగలమర్రి 17, జూపాడు బంగ్లా 16, ఓర్వకల్లు 15, ఉయ్యాలవాడ 14, మంత్రాలయం 13, కోసిగి 13, మహానంది 11, కొత్తపల్లి 11, కొలిమిగుండ్ల 10, ఆస్పరి 9, చిప్పగిరి 9, సంజామల 9, సీ బెళగల్ 8, రుద్రవరం 6, కృష్ణగిరి 5, పగిడ్యాల 5, దొర్నిపాడు 3, వెలుగోడు 3, హొళగుంద 2, శ్రీశైలం 2, హాలహర్విలో 1 చొప్పున కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.
జిల్లాలో ఇప్పటి వరకు లక్షా 38 వేల 795 నమూనాలు సేకరించారు. ఇతర రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వచ్చిన వలస కూలీల్లో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు. అత్యధికంగా పరీక్షలు చేస్తున్నందువల్లే కరోనా కేసులు బయటపడుతున్నాయని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి:
కరోనా రోగుల అంబులెన్స్... ఎంతమంది ఎక్కడానికైనా ఉంది లైసెన్స్